కొత్త ఎయిర్ పోర్ట్ టెర్మినల్‌ని ప్రారంభించనున్న బహ్రెయిన్

- January 11, 2021 , by Maagulf
కొత్త ఎయిర్ పోర్ట్ టెర్మినల్‌ని ప్రారంభించనున్న బహ్రెయిన్

మనామా:బహ్రెయిన్, జనవరి 28న కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌ని ప్రారంభించనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయి‌ర్ పోర్ట్ విస్తరణలో భాగంగా కొత్త టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత మార్చిలోనే ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సి వుండగా, కరోనా వైరస్ పాండమిక్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎయిర్ పోర్టులో క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ పర్యటించి, అక్కడి పరిస్థితుల్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు డెస్టినేషన్లకు బహ్రెయిన్ రీజినల్ హబ్‌గా వ్యవహరించడంలో ఈ కొత్త ఎయిర్ పోర్టు కీలకంగా వ్యవహరించనుందని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో వున్న టెర్మినల్‌తో పోల్చితే కొత్త టెర్మినల్ నాలుగు రెట్లు పెద్దది. సంవత్సరానికి 14 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కార్ పార్కింగ్, డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏరియా, రెండు రిసెప్షన్ హాల్స్, సెంట్రల్ యుటిలిటీస్ నిమిత్తం కాంప్లెక్స్ వంటివి ఇక్కడ కొలువు దీరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com