వాయిస్ మెసేజ్‌తో పార్కింగ్ రుసుము
- February 22, 2016
అజ్మన్ మునిసిపాలిటీ పెయిడ్ పార్కింగ్ కోసం న్యూ యాప్‌ని ప్రారంభించింది. పార్కింగ్ టిక్కెట్‌ని వాయిస్ మెసేజ్ ద్వారా చెల్లించే విధానాన్ని ఈ యాప్ ద్వారా ప్రవేశపెట్టారు. అజ్మన్ మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో స్మార్ట్ సర్వీసెస్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ యూసఫ్ అల్ షైబా మాట్లాడుతూ 'మావ్‌ఖిఫి' పేరుతో రూపొందించిన ఈ యాప్, రీజియన్‌లో మొట్టమొదటిదని అన్నారు. పెయిడ్ పార్కింగ్ కోసం సమీపంలోని మెషీన్స్ వద్దకు వెళ్ళాల్సిన పనిలేకుండా, తమ మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ని వినియోగించుకుని కేవలం వాయిస్ మెసేజ్‌తో పార్కింగ్ రుసుము చెల్లించవచ్చని ఆయన అన్నారు. అలాగే ఈ యాప్ ద్వారా అవసరమైనప్పుడు ముందుగానే వీఐపీ పార్కింగ్‌ని కూడా బుక్ చేసుకోవచ్చట. ఎక్కువ సమయం పార్కింగ్ చేసుకోవాలనుకునేవారికి 60 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు అల్ షైబా చెప్పారు. సెంట్రల్ పార్కింగ్ సిస్టమ్, మునిసిపాలిటీ ఇన్‌స్పెక్టర్స్ వినియోగించే సిస్టమ్‌కీ ఈ యాప్ కనెక్ట్ అయి ఉంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







