తిరిగి స్కూళ్ళకు:మార్గదర్శకాలు విడుదల చేసిన ఒమన్
January 13, 2021_1610547450.jpg)
మస్కట్:గ్రేడ్ 1, 4, 5, 9 అలాగే 11 విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ విధానంలో జనవరి 17 నుంచి వెళ్ళవలసి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సుప్రీం కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి, మిగతా గ్రేడ్స్ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళే విషయమై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. స్కూళ్ళను ఆపరేట్ చేసే విషయమై పూర్తిస్థాయిలో నిబంధనల్ని విడుదల చేయడం జరిగింది. వాటికి అనుగుణంగా తరగతుల నిర్వహణ వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.