వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్

- January 15, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్

కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నా  క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండదని కువైట్ ప్రకటించింది. విదేశాల నుంచి కువైట్ వచ్చే వారు...విదేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించినా..దాన్ని తాము పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో కొందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని, అందుకే క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ ల నుంచి మినహాయింపు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే..కువైట్ లో నే వ్యాక్సిన్ తీసుకొని వేరే దేశాలకు వెళ్లి..మళ్లీ తిరిగి వచ్చే వారికి మాత్రం క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని కూడా వెల్లడించింది. అయితే..దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా కువైట్ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com