టీకా కార్యక్రమం విజయవంతం కావటం పట్ల ఏ.పీ గవర్నర్ అభినందన
- January 17, 2021విజయవాడ:కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. శనివారం దేశవ్యాప్తంగానూ, ఆంధ్రప్రదేశ్ లోనూ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించటం ముదావహమన్నారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పరిశోధకులు తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ముందువరుస ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?