'FCUK' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
- January 18, 2021
హైదరాబాద్:టాలీవుడ్ హీరో జగపతి బాబు తన సెకండ్ ఇన్సింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా మారారు. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన ఈ హీరో.. పలు సినిమాల్లో విలన్‌గా, తండ్రి పాత్రలు పోషించారు. ప్రస్తుతం జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘FCUK (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. ఈ మూవీకి డెబ్యూట్ డైరెక్టర్ విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని నాలుగు పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం.
జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‌సీయూకే మూవీని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ మూవీ ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకముందని చెప్పారు. ప్రేక్షకులకు ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ మూవీ కోసం పనిచేసిన నిర్మాత దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ విద్యాసాగర్ రాజు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రితతోపాటు చిత్రయూనిట్ సభ్యులను ప్రశంసించాడు జగపతి బాబు. కేఎల్ దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తుండగా.. కార్తీక్, అమ్ముఅభిరామి, బేబి సహశ్రిత ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు