ఏ.పీలోని జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిజిపి

- January 19, 2021 , by Maagulf
ఏ.పీలోని జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిజిపి

అమరావతి:సెప్టెంబర్ 5వ తేదీ ఘటన అనంతరం రాష్ట్రం లోని వివిధ జిల్లాల్లో దేవాలయాలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతి, దర్యాప్తు తీరుతెన్నులు, దేవాలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్రలు, గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లలపైన  రాష్ట్ర స్థాయి జిల్లా ఎస్పీ లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు అదే విధంగా వివిధ జిల్లాల్లో అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలతో కేసులు చేయించడంలో ప్రజల నుండి అందిన సహాయసహకారాల పైన ప్రధానంగా కాన్ఫరెన్స్ జరిగింది.  కృష్ణ, గుంటూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో దేవాలయాలకు సంభందించిన కేసుల దర్యప్తులో  ప్రజల నుండి  తమకు అందిన,  అందుతున్న సహకారాన్ని ఎస్పీలు వివరించడం జరిగింది.అంతే కాకుండా ఇప్పటి వరకు తమతమ జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో దేవాలయాల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, సి‌సి కెమెరాల అమర్చడం తో పాటు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని డి‌జి‌పికి వివరించడం జరిగింది.


 ఈ సంధర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ప్రజల సహకారం ఎంతో అవసరమని అందుకు ఉదాహరణ ఇటీవల గుంటూరు,శ్రీకాకులం జిల్లా కేసులే ఉదాహరణ అని పేర్కొన్నారు. అదే విధంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జిల్లా కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని, జిన్నా టవర్ సెంటర్ సమీపంలోని కుసుమ హారాణధా  ఆలయంలో విగ్రహాలను  దొంగిలించిన ఘటన లో ఆలయ పూజారి సతీమణి హైమవతి చూపిన దైర్యం,సాహసాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రజాలోకి తీసుకెళ్లాలని ఎస్పీలకు సూచించారు.రాష్ట్ర పౌరులుగా తమవంతు భాధ్యతగా పోలీసులకు సహకారాన్ని అందించిన గుంటూరు జిల్లాకు  హైమవతి, శ్రీకాకులం కు చెందిన రమణ, శ్రీరాములు, శ్రీనివాస్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. అదే విధంగా గత నాలుగు నెలలుగా దేవాలయం పరిరక్షణ లో భాగంగా ఇప్పటివరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం, 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు, నిరంతర నిఘా తో పటిష్టమైన భద్రతను కల్పిస్తునమన్నారు. గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం  దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది  నేరస్తులను అరెస్ట్ చేయడంమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు పూర్తి అయింది. త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. కొంతమంది పనిగట్టుకొని  ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు,  ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం,  ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com