ఆర్కియలాజికల్ ల్యాండ్ మార్క్స్ వద్ద గైడ్లుగా బ్రహెయినీ విద్యార్థులు

- January 20, 2021 , by Maagulf
ఆర్కియలాజికల్ ల్యాండ్ మార్క్స్ వద్ద గైడ్లుగా బ్రహెయినీ విద్యార్థులు

మనామా:ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు, విద్యనభ్యసించేందుకుగాను ప్రాక్టికల్ ఫీల్డ్ అనుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అకడమిక్ కాంపిటెన్సీస్, పర్సనల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్, నేషనల్ మరియు హ్యమానిటేరియన్ అంశాల్లో వారికి కొత్త తరహా విద్యాభ్యాసం అందించనున్నారు. ఒమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రైమరీ స్కూల్ బాయ్స్ విద్యార్థులను యువ టూరిస్టు గైడులుగా మార్చుతున్నారు. విద్యార్థులు, టూరిస్ట్ మరియు ఆర్కియాలజీ ప్రాంతాల్లో షార్ట్ ఫిలిమ్స్ రూపొందిచడం, సందర్శకులకు గైడ్లుగా వ్యవహరించడం ద్వారా వారు ఆయా ప్రాంతాలపై అవగాహన పెంచుకుంటారు.. చారిత్రక విశేషాల్ని మరింత సమర్థవంతంగా తెలుసుకోగలగుతారు. పలు ఫేజ్‌లలో ఈ ప్రాజెక్టుని కొనసాగిస్తారు. డిపార్టుమెంట్ ఆఫ్ సోషల్ మెటీరియల్స్ - ఒమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రైమరీ స్కూల్ బాయ్స్ టీచర్లు తమ ఎడ్యుకేషనల్ పోర్టల్ ద్వారా విద్యార్థుల్లో మరింత చైతన్యం నింపుతారు. విద్యార్థులు, ఆయా వీడియోలపై, ప్రెజెంటేషన్లపై తమ అభిప్రాయాలు పంచుకోవడంతోపాటు, ఈ విభాగంపై మరింత పట్టు సాధించగలుగుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com