1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల కొనసాగింపు

- January 20, 2021 , by Maagulf
1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల కొనసాగింపు

మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల తొలగింపు జరగడంలేదనీ, వారంతా విధుల్లో కొనసాగవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. 10 ఎస్టాబ్లిష్‌మెంట్లలో 1315 మంది కార్మికులకు సంబంధించి తొలగింపు ప్రక్రియను నిలుపుదల చేయడం జరిగిందనీ, వారంతా విధుల్లో కొనసాగుతారనీ తెలుస్తోంది. ఈ అంశంపై మరింత లోతుగా చర్చ జరుగుతుందనీ, వేతనాల తగ్గింపు వంటి అంశాలను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వర్గాలు ఉటంకించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com