రియాద్ పై దాడికి విఫలయత్నం...సమర్ధవంతంగా తిప్పికొట్టిన సౌదీ
- January 23, 2021సౌదీ అరేబియా రాజధాని రియాద్ పై వాయు దాడికి విఫలయత్నం జరిగింది. ఆకాశం నుంచి రియాద్ వైపుగా దూసుకొచ్చిన మిస్సైళ్లను సౌదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొని విధ్వంసం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే..దాడి లక్ష్యం ఏంటి..? దాడికి ఎవరు కుట్ర చేశారు? అనేది మాత్రం సౌదీ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఆకాశంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో గుర్తు తెలియని వస్తువు తెల్లని పొగ ఎగచిమ్ముతూ రియాద్ వైపు దూసుకురావటం తాము గమనించామని, ఆ సమయంలో తమ ఇళ్లు షేక్ అయిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రియాద్ ను లక్ష్యంగా చేసుకొని పలు మార్లు దాడి ప్రయత్నాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పొరుగు దేశమైన యెమన్ లో జరుగుతున్న సివిల్ వార్ లో యెమన్ ప్రభుత్వానికి సౌదీ నేతృత్వంలోని సంయుక్త దేశాలు మద్దతు ఇస్తూ వస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న హౌతి అతివాద సంస్థ ఇప్పటికే పలుమార్లు సౌదీని లక్ష్యంగా చేసుకొని దాడి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత దాడి యత్నం కూడా యెమన్ హౌతి పనే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా..అందుకు ఆధారాలు మాత్రం లేవు. ఇదిలాఉంటే..దాడి ప్రయత్నం నేపథ్యంలో సౌదీ అరేబియాలో తమ దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక విడుదల చేసింది. అయితే.. అధునాతన ఆయుధాలు అందిస్తూ ఇరాన్..హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలబడుతోందన్నది పాశ్చత్య దేశాల నిపుణులు, సౌదీ అరేబియా, అమెరికా వాదిస్తోంది. కానీ, ఇరాన్ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్