ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- January 24, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు నిన్నటి మీద కాస్త తగ్గాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  887010కి చేరింది.  ఇందులో 878387 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1476 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా మరణించ లేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7147కి చేరింది. ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 155 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.


--ఆర్.వి.ఆర్.ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com