డెంటల్, కాస్మొటిక్ సర్జరీల నిలిపివేత
- January 25, 2021యూఏఈలో తాత్కాలికంగా డెంటల్ మరియు కాస్మొటిక్ సర్జరీలను నిలిపివేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. షార్జా, అజ్మన్, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ మరియు ఫుజైరః లోని హెల్త్ ఫెసిలిటీస్‌కి ఈ ఆదేశాలు వర్తిస్తాయి. జనరల్ అనస్తీషియా, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్ వంటివి అవసరమైన సర్జరీలను ఆయా ఫెసిలిటీస్ నిలిపివేయాల్సి వుంటుంది. హెయిర్ రిమూవల్, బొటాక్స్, ఫిల్లర్స్ మరియు ఫేస్ లిఫ్ట్ అలాగే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటివి ఆపేయాల్సి వస్తుంది. తుమ్ములు, దగ్గులు, జలుబు వంటి రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి సంబంధించిన డెంటల్ సేవల్ని వాయిదా వేయక తప్పదు. కప్పింగ్ మరియు ఫిజియోథెరపీ వంటి సేవల్ని కూడా వాయిదా వేయాల్సి వుంటుందని సర్కులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్