బంగారం ధర ఈ రోజు పెరిగింది

- February 24, 2016 , by Maagulf
బంగారం  ధర ఈ రోజు పెరిగింది

వరసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ డిమాండుతో మళ్లీ రూ.29,000 మార్కును దాటేసింది. బుధవారం రూ.190 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,229.11 అమెరికన్‌ డాలర్లకు చేరింది.
అలాగే బుధవారం వెండి ధర తగ్గింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.37,100కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com