ద్వైపాక్షిక సంబంధాల పై ప్రధాని మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సంభాషణ

- January 29, 2021 , by Maagulf
ద్వైపాక్షిక సంబంధాల పై ప్రధాని మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సంభాషణ

యూఏఈ:భారత ప్రధాని నరేంద్ర మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఫోన్ లో మాట్లాడారు. ఇటీవలె 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న భారత్ కు యూఏఈ తరపున మొహమ్మద్ బిన్ జయాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఇరు దేశాల మైత్రితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, కోవిడ్ సవాళ్లపై డిస్కస్ చేశారు. కోవిడ్ గడ్డుకాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని అభిలాశించారు. ఆర్ధిక, వాణిజ్య, సాంకేతికత, విద్యుత్, ఇంధన రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారం ఇరు దేశాల ప్రజలు లబ్ధి కలిగిస్తుందని అన్నారాయన. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ బిన్ జయాద్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ..యూఏఈతో మైత్రి బంధాన్ని బలపర్చుకునేందుకు భారత్ ఎప్పుడూ సానుకూల భావనతోనే ఉంటుందని అన్నారు. అవకాశం ఉన్న పలు రంగాల్లో పరస్పరం పెట్టుబడులకు సులభ మార్గాలను ఏర్పర్చటం ద్వారా దైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com