కోవిడ్ ఎఫెక్ట్ : మళ్లీ ఆంక్షల బాటలో జీసీసీ దేశాలు

- January 30, 2021 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్ : మళ్లీ ఆంక్షల బాటలో జీసీసీ దేశాలు

కరోనా కేసుల్లో నమోదవుతున్న స్వల్ప వృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాల కోవిడ్ ఉత్పరివర్తనాల గుర్తింపుతో జీసీసీ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. తమ దేశంలో ఉత్పరివర్తనాలు ప్రభావశీలంగా మారకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా...అది దీర్ఘకాలిక ప్రణాళికతో కూడుకున్నది కావటంతో అప్పటివరకు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు జీసీసీలోని కీలక సభ్య దేశాలు ఆంక్షల బాట పడుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ కు పెద్దన్నగా చెప్పుకునే సౌదీ అరేబియా..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను మరో నెల రోజుల పాటు పొడిగించింది. మార్చి 31తో ప్రయాణాలపై నియంత్రణ ఆంక్షలు ముగియాల్సి ఉన్నా...వైరస్ స్ట్రెయిన్స్ తో ముప్పు ఉండటంతో మే 17 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని సౌదీ క్లారిటీ ఇచ్చింది. ఇక ఒమన్ కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలు భౌతిక దూరం పాటించటం, జనసమీకరణకు దూరంగా ఉండేలా అంతర్జాతీయ సదస్సులు, స్పోర్ట్స్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లతో పాటు అన్ని వేడుకలు, సమావేశాలపై నిషేధం విధించింది. భూ సరిహద్దులను మూసివేసింది. వర్సిటీల పునప్రారంభాన్ని వాయిదా వేసింది. పౌరులు, ప్రవాసీయులు అత్యవసరం అయితేనే అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలని సూచించింది. అటు బహ్రెయిన్ కూడా కేఫ్ లు, రెస్టారెంట్లలో డైనింగ్ సౌకర్యాన్ని నిలిపివేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తరగతుల నిర్వహణను మూడు వారాల పాటు వాయిదా వేసి ఆన్ లైన్ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. మరో గల్ఫ్ కంట్రీ కువైట్...కింగ్డమ్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యను వీలైనంత మేర తగ్గించేలా ప్రయత్నాలు చేపట్టింది. రెండో దశగా కమర్షియల్ ఫ్లైట్స్ సంఖ్యను పెంచే నిర్ణయాన్ని వాయిదా వేసింది. కువైట్ కు వచ్చే విమానాల్లో ప్రయాణికుల సంఖ్యను కుదించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com