ట్రావెల్ బ్యాన్ ను మే 17 వరకు పొడిగించిన సౌదీ అరేబియా

- January 30, 2021 , by Maagulf
ట్రావెల్ బ్యాన్ ను మే 17 వరకు పొడిగించిన సౌదీ అరేబియా

రియాద్:రోడ్డు మార్గాలు, జల సరిహద్దులు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 17 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే..జనవరిలో చేసిన ప్రకటన మేరకు మార్చి 31తో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ముగియాల్సి ఉంది. కానీ, ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తుండటం, వైరయస్ వేరియంట్స్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్యావెల్ బ్యాన్ ను పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల్లో ఇమ్యూనిటీ స్థాయిలను పెంచటమే తమ ప్రధమ లక్ష్యమని ఆ తర్వాతే ప్రయాణాలపై ఆలోచిస్తామని పేర్కొంది. పరిస్థితులు అనుకూలిస్తే మే 17 అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఎయిర్ పోర్టుల, సీ పోర్టులతో పాటు భూ సరిహద్దు రహదారులు పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది. ఇదిలాఉంటే...కింగ్డమ్ పరిధిలో గత 24 గంటల్లో 267 కొత్త కేసులు నమోదయ్యాయి. 253 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. అయితే..కింగ్డమ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కు డోసుల దిగుమతిలో జరుగుతున్న ఆలస్యం ఇబ్బందిగా మారుతోంది. తర్వాతి దశ బ్యాచ్ దిగుమతి ముందనుకున్న గడువు కన్నా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com