తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు

- January 30, 2021 , by Maagulf
తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈరోజు కొంచెం తగ్గింది... తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 186 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు... ఇదే సమయంలో 367 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,94,306కు చేరుకోగా.. 2,90,354 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,598 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.65 శాతంగా ఉందని.. ప్రస్తుతం 2,354 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 920 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 33,088 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య  78,23,989 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com