కువైట్:విమానాల్లో లిమిటెడ్ సీట్ల నిబంధనతో ప్రవాసీయులకు తప్పని తిప్పలు

- January 31, 2021 , by Maagulf
కువైట్:విమానాల్లో లిమిటెడ్ సీట్ల నిబంధనతో ప్రవాసీయులకు తప్పని తిప్పలు

కువైట్ సిటీ:కువైట్ కు వచ్చే విమానాల్లో లిమిటెడ్ సీట్ల నిబంధన ప్రవాసీయులకు ఇబ్బందుల పాలు చేస్తోంది. ముఖ్యంగా బ్యాన్డ్ కంట్రీస్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారు విదేశాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోవిడ్ ఉత్పరివర్తనాలు ప్రమాదకర స్థాయిలో వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన కువైట్...కింగ్డమ్ కు వచ్చే ప్రయాణికుల పట్ల ఆంక్షలు విధించింది. ప్రతి రోజుకు వెయ్యి మంది మాత్రమే దేశంలోకి వచ్చేలా ప్రయాణికుల సంఖ్యను కుదించింది. ఒక్కో ఫ్లైట్లో కేవలం 35 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని డీజీసీఏ ఆయా విమానయాన సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ తాత్కాలిక నిబంధనను ఫిబ్రవరి 6వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది. అయితే..కువైట్ తీవ్రత ఎక్కువగా ఉన్న 35 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులు నేరుగా వెళ్లకుండా ముందుగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ 14 రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాత కువైట్ వెళ్తున్నారు. అయితే..ప్రయాణికుల సంఖ్యను 1000కి పరిమితం చేయటంతో ఇతర దేశాల్లో క్వారంటైన్ లో ఉన్న ప్రవాసీయులు ఇప్పుడు ఇంకొన్నాళ్లు విదేశాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టికెట్లు కన్ఫమ్ అయ్యే వరకు ఇతర దేశాల్లో వేచి చూడాల్సి వస్తోంది. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com