వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు

- February 01, 2021 , by Maagulf
వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు

దోహా:కహరామా వాటర్ కన్జంప్షన్ బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు కూడా ఇకపై జతచేయబడనుంది. ఫిబ్రవరి 2021 నుంచి కహరామా బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు చేర్చబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి వినియోగాన్ని రేషనలైజ్ చేసే క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖతారీ పౌరులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నాన్ ఖతారీలు అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్స్ మాత్రం శానిటేషన్ ఫీజుని చెల్లించాలి. ఉదాహరణకు వాటర్ బిల్లు 300 ఖతారీ రియాల్స్ అయితే, వేస్ట్ వాటర్ ఛార్జీలు 60 ఖతారీ రియాల్స్ మాత్రమే జత చేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com