ఎన్నారైలకు గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికులకు స్యాడ్ న్యూస్

- February 01, 2021 , by Maagulf
ఎన్నారైలకు గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికులకు స్యాడ్ న్యూస్

తెలంగాణ:కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల వలన ఏర్పడిన ప్రపంచ ఆర్ధిక మాంద్యం, విదేశాలలో నిరుద్యోగం కారణంగా స్వదేశానికి వాపస్ వచ్చిన ప్రవాస భారతీయులకు కొంత ఊరట కలిగిస్తూ ఫిబ్రవరి 1 వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ధనవంతులైన ఎన్నారైలకు పన్ను మినహాయింపు రూపంలో తీపి కబురు అందించింది. అల్పాదాయ గల్ఫ్ కార్మికుల సంక్షేమ  ప్రస్తావన లేకుండా గల్ఫ్ కార్మికులను నిరాశపరిచింది. 

ఎన్నారైలకు విదేశంలో, భారత దేశంలో రెండుసార్లు పన్ను విధించకుండా 'డబుల్ టాక్సేషన్' లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నారైలు 'వన్ పర్సన్ కంపెనీ' (ఏక వ్యక్తి కంపెనీ) స్థాపించడానికి అవకాశం కల్పించారు. ఎన్నారై హోదా పొందడానికి విదేశాలలో 182 రోజులు నివసించాలన్న నిబంధనను 120 రోజులకు కుదించారని  మంద భీంరెడ్డి(గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు) అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com