‘F3’ ఫ్యామిలీ షూటింగ్ షురూ

- February 01, 2021 , by Maagulf
‘F3’ ఫ్యామిలీ షూటింగ్ షురూ

హైదరాబాద్:2018 లో సంక్రాంతి హిట్ గా నిలిచిన “ఎఫ్‌2” చిత్రానికి సీక్వెల్‌గా “ఎఫ్‌ 3” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 27న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తదుపరి ఎపిసోడ్ గా ఫ్యామిలీని సెట్స్ లోకి దించింది చిత్రబృందం. తాజాగా సెట్స్ లో దిగిన “ఎఫ్‌ 3” ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. వెంకీ-వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాలో ఫ‌స్ట్ పార్టులో న‌టించిన‌ త‌మ‌న్నా, మెహ‌రీన్ “ఎఫ్ 3” లోనూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త్వరలోనే ఈ ఫ్యామిలీ గ్రూప్ షూటింగ్ లో వరుణ్ తేజ్, మెహరీన్ లు జాయిన్ అవ్వనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com