అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35 వేల కేసులు నమోదు
- February 05, 2021
అబుధాబి:గతేడాది అబుధాబి పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35,073 కేసులను నమోదు చేసినట్లు ట్రాఫిక్, పాట్రోలింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. రోడ్డు అడ్డదిడ్డంగా లేన్లు మార్చటంతో పాటు వాహనం వాహనం మధ్య సరిపడినంత దూరాన్ని పాటించని వారిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. షాడో డ్రైవింగ్ తో పాటు ఇతర వాహనాలకు సైడ్ ఇవ్వటంలో నిర్లక్ష్యం, తగిన సూచనలు లేకుండా పక్క లేన్ లోకి దూసుకెళ్లటం వంటి అలక్ష్య ధోరణి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని..అలాంటి ఉల్లంఘనలను క్షమించే ప్రసక్తే లేదని అబుధాబి ట్రాఫిక్ విభాగం గతంలోనే హెచ్చరించింది. అయినా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను విడిపించుకోవాలంటే 5000 దిర్హామ్ లు జరిమానా చెల్లించాలని...ఫైన్ చెల్లించిన వాహనదారులు మూడు నెలల్లోపే తమ వాహనాలను తీసుకువెళ్లవచ్చని స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ఫైన్ చెల్లించకుంటే వాహనాలను వేలం వేస్తామని హెచ్చరించారు. ఇక ఇతర వాహనాలతో తగినంత దూరాన్ని పాటించకుండా డ్రైవింగ్ చేసిన వారికి 400 దిర్హామ్ ఫైన్, 4 బ్లాక్ పాయింట్లు విధించినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







