కోవిడ్ 19: కొత్త నిబంధనలు జారీ చేసిన ఖతార్
- February 05, 2021
దోహా:కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకోసం మళ్ళీ కొత్త నిబంధనల్ని ఖతార్ అమల్లోకి తెచ్చింది. ఎడ్యుకేషన్, లీజర్, బిజినెస్ యాక్టివిటీస్ వంటివాటికి సంబంధించి మళ్ళీ నిబంధనలు కఠినతరం చేయడం జరిగింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, థీమ్ పార్కులు, రెస్టారెంట్ కెపాసిటీలు వంటి వాటికి సంబంధించి పలు నిబంధనల్ని కొత్తగా అమల్లోకి తెచ్చాయి అథారిటీస్. ఖతారీ మార్కెట్లు కేవలం 50 శాతం సామర్థ్యంతోనే ఇకపై పనిచేయాలి. ఇంటి వద్ద జరగని పెళ్ళిళ్ళపై బ్యాన్ విధించారు. ఇంటి వద్ద వివాహాల్లో కేవలం బంధువులకు మాత్రమే అవకాశం కల్పించాల్సి వుంటుంది. నర్సరీలు 30 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. ఈ నిబంధనల్ని మినిస్ట్రీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పార్కు్ల్లో ఔట్ డోర్ గేదరింగ్స్ విషయానికొస్తే, ఇది కేవలం 15 మందికే పరిమితం. ఇండోర్ గేదరింగ్స్ అయితే కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం. బోట్ రెంటల్స్‌పై నిషేధం విధించారు. పర్సనల్ బోట్ల సామర్థ్యం 15 మందికే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







