బహ్రెయిన్ లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..కరోనా కట్టడికి కార్మిక శాఖ ఆదేశాలు
- February 07, 2021
మనామా:కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు చర్యలు చేపడుతోంది. ఇక నుంచి మంత్రిత్వ శాఖలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ తో పాటు కార్మిక శాఖలోని కార్యాలయాల్లో విధులు నిర్వహించే వాళ్లంతా రేపటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించొచ్చని ఆదేశించింది. కార్మిక శాఖలో సేవలు పొందాలనుకునే వీలైనంత వరకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ వినియోగించాలని అధికారులు సూచించారు. హాట్ లైన్ నెంబర్ 80008001కి కూడా కాల్ చేసి వివరాలు పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







