ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా

- February 08, 2021 , by Maagulf
ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా

దుబాయ్:యాట్‌లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో జనం గుమికూడి పార్టీ చేసుకుంటుండగా,ఈ పార్టీని భగ్నం చేశారు అధికారులు.ఈ మేరకు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్ ధరించకుండా వేడుక చేసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50,000 దిర్హాముల జరీమానా ఇప్పటికే విధించడం జరిగింది.దుబాయ్ టూరిజం డిపార్టుమెంట్, యాట్ ఆపరేటర్ లైసెన్సుని నెల రోజులపాటు సస్పెండ్ చేసింది.20 మందికి మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రైవేటు పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది అబుదాబీలో ఇటీవలే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com