వూహాన్లో కీలక ఆధారాలు లభ్యం:WHO
- February 08, 2021
వూహాన్:కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనాలో పర్యటించి ఆధారాలు సేకరించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)పై ఒత్తిడి తీసుకురావడంతో గత రెండు వారాలకుపైగా WHO శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటిస్తోంది. ఇక చైనాపై వస్తున్న ఆరోపణలను సైతం చైనా ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వూహాన్లో పర్యటిస్తున్న WHO నిపుణుల బృందం కరోనా మహమ్మారి పుట్టిక, వ్యాప్తికి సంబంధించి వివరాలు, ఆధారాల సేకరిస్తోంది.ఈ పర్యటనలో 14 మందితో కూడిన బృందం రెండు వారాలుగా క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తోంది.కాగా, కోవిడ్ వ్యాప్తిలో వూహాన్ సీపుడ్ మార్కెట్ పాత్రకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభ్యమైనట్లు WHO బృందం సభ్యుడు పీటర్ డెస్జాక్ సోషల్ మీడియాల్లో ప్రకటించారు.ఫిబ్రవరి 10న పర్యటన ముగుస్తుందని, తాము తిరిగి వెళ్లేలోపు ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు వెల్లడించే అవకాశం ఉందని న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.ఈ బృందం వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశం అయింది. అలాగే మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







