దుబాయ్ లోని గురుద్వారాలో కరోనా వ్యాక్సిన్
- February 09, 2021
దుబాయ్: సాధారణంగా దుబాయ్ సిఖ్ టెంపుల్ వద్ద పెద్దయెత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం జనం గుమికూడేవారు. కొందరు, సిక్కు సమాజం అందించే ఆహార పదార్థాల కోసం ఎదురుచూసేవారు. అలా ప్రజల సేవలో తరించిన సిక్కు సమాజం, కరోనా నేపథ్యంలో కొత్త సేవా మార్గాన్ని ఎంచుకుంది. 5 వేల మందికి సినోఫామ్ కరోనా వ్యాక్సిన్‌ని అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో సిఖ్ టెంపుల్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి విషయాల్లో స్థానిక సిక్కులు వచ్చేవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 4.4 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించడం జరిగింది. 16 ఏళ్ళ పైబడిన వయసున్నవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!