యూఏఈ సందర్శకులకు మార్షియన్ ఇంక్ స్టాంప్
- February 09, 2021
దుబాయ్: యూఏఈకి వచ్చేవారికి మార్షయన్ ఇంక్ స్టాంప్‌ను వారి పాస్‌పోర్టులపై వేయడం జరుగుతోంది. యూఏఈ తరఫున హోప్ ప్రోబ్, మార్స్ ఆర్బిట్‌లోకి నేడు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ ఘనతకు గుర్తుగా ఈ ముద్రను వేస్తున్నారు అధికారులు. యూఏఈ ప్రభుత్వ మీడియా ఆఫీస్, దుబాయ్ ఎయిర్ పోర్ట్స్‌తో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అరబిక్ అలాగే ఇంగ్లీషులో ‘మీరు ఎమిరేట్స్‌కి వచ్చారు.. ఎమిరేట్స్, మార్స్‌ని ఫిబ్రవరి 9న అందుకుంటోంది’ అనే అర్థం వచ్చేలా స్టాంప్ వేస్తున్నారు. ఫిబ్రవరి 7న కూడా స్పెషల్ స్టాంప్ కొందరికి వేయడం జరిగింది. మార్షియన్ వాతావరణానికి సంబంధించిన బొమ్మ కూడా ఈ స్టాంప్ మీద వుంటుంది. 2020 జులై 20న హోప్ ప్రోబ్, మార్స్ ప్రయాణానికి బయల్దేరింది.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్