2022 ఫీఫా వరల్డ్ కప్ కు సిద్ధమైన ఖతార్..యూఏఈలో ప్యాకేజ్ సేల్స్ షురూ
- February 09, 2021
దోహా:కోవిడ్ సీజన్లో బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్ కు రెడీ అవుతోంది ఖతార్. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ కు సై అంటోంది. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో వచ్చే ఏడాది నాటికి వరల్డ్ కప్ ఆటంకాలు ఉండే అవకాశాలు లేవని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే..గల్ఫ్ కంట్రీస్ చరిత్రలోనే జరుగుతున్న తొలి ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అభిమానులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు..ఆసియాలో దేశాల్లోనే ఇది రెండో ఫిఫా వరల్డ్ కప్ కావటం విశేషం. ఈ మెగా ఈవెంట్ కు విడిది స్లాట్స్, టికెట్ల అమ్మకాలను కూడా ప్రారంభమయ్యాయి. యూఏఈలోని ఫుట్ బాల్ ఫ్యాన్స్ కోసం డీఎంసీసీ అనే స్పోర్ట్ టూరిజం ప్యాకేజీల వారీగా టికెట్ సేల్స్ ప్రారంభించింది. దుబాయ్ బేస్డ్ డీఎంసీసీ స్పోర్ట్ టూరిజం ప్రవాసీయుడి చెందిన విషయం తెలిసిందే. ఫుట్ బాల్ అభిమానుల కోసం హై రేంజ్లో ఉన్న ‘పెర్ల్ లాంజ్’ ప్యాకేజీతో పాటు.. ఇష్టమైన ఆటను ఆస్వాదించేలా ‘మ్యాచ్ క్లబ్’ కిందిస్థాయి ప్యాకేజీని ప్రకటించింది. అలాగే మిడిల్ క్లాస్ ప్యాకేజీల్లో భాగంగా...మ్యాచ్ ప్రైవేట్ సూట్, మ్యాచ్ బిజినెస్ సీట్, మ్యాచ్ పెవిలియన్ ఇంటర్మీడియట్ ప్యాకేజీల నుండి కూడా ఎంచుకోవచ్చని డీఎంసీసీ వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలోనే టికెట్ సేల్స్ ప్రారంభం అవగా..అభిమానుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని సేల్స్ ఇన్ ఛార్జ్ వెల్లడించారు. కోవిడ్ భయాందోళనలోనూ అభిమానుల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే..టికెట్ల సేల్స్ లో కొత్త రికార్డ్ ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ ధరలు 14,350 యూఎస్ డాలర్ల నుంచి 74,200 యూఎస్ డాలర్ల వరకు ఉన్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







