వాహనదారుల భద్రతే ప్రమాణంగా రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సౌదీ
- February 10, 2021
సౌదీ:వాహనదారుల భద్రత, రద్దీకి సరిపడేలా ఈజీ ఫ్లోటింగ్ కు అనువుగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. గత నెలలో కింగ్డమ్ వ్యాప్తంగా చేపట్టిన పలు రహదారి అభివృద్ధి పనులను వివరించారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ అధ్యయనం,సర్వేలు చేసిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు.సర్వేల సూచనల మేరకు దేశంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 189 కిలోమీటర్ల మేర మరమ్మతు పనులు నిర్వహించామని, ఐదు చోట్ల ఇంటర్ సెక్షన్ పనులను పూర్తి చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వర్షాకాలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాలు, లోయ ప్రాంతాలను కూడా కమ్యూనికేట్ చేసేలా క్లినింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు..17 బ్రిడ్జిలకు అవసరమైన నిర్వహణ పనులను పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాదు..దేశవ్యాప్తంగా 4,652 కిలోమీటర్ల మేర మురికి రోడ్ల సర్వే పూర్తయిందని...అవసరమైన చోట తగిన నిర్వహణ చర్యలు చేపడుతామని తెలిపింది.వాహనదారుల భ్రదతకు కింగ్డమ్ లోని రహదారుల నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!