మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచిన బహ్రెయిన్
- May 29, 2015
సౌదీ అరేబియాలోని అల్ ఖతీఫ్‌లోగల కుదీప్‌ాని ఓ మసీదులో తీవ్రవాదులు దాడి చేసిన ఘనటతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా, బహ్రెయిన్‌లో మసీదులకు రక్షణ పెంచామనీ, ఎలాంటి తీవ్రవాద ఘటనలూ జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీవ్రవాద చర్యలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనీ, అలాంటి చర్యలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారాయన.మసీదుల్ని నిర్వహిస్తున్నవారు రక్షణ కోసం ప్రభుత్వంతో సహకరించాలనీ, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.జఫ్పారీ ఎండోమెంట్ ఛైర్మన్ షేక్ మొప్‌ాసెన్ అలీ మాట్లాడుతూ, మహిళలు కొన్ని రోజులపాటు మసీదు వద్ద ప్రాదర్ధనలకు దూరంగా వుండాలనీ, భద్రతా ఇబ్బందుల కారణంగానే సహకరించమని కోరుతున్నట్లు చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









