పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపు..

- February 16, 2021 , by Maagulf
పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపు..

పుదుచ్చేరి:పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి ఊహించని షాకిచ్చింది కేంద్రం. ఎల్‌జీ పదవి నుంచి కిరణ్‌బేడీని తొలగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడిని తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. పుదుచ్చేరి ఇంచార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు.గత కొద్దికాలంగా సీఎం నారాయణస్వామితో కిరణ్‌బేడీకి ఆధిపత్య పోరు నడుస్తోంది.ప్రస్తుతం పుదుచ్చేరి సర్కార్‌ మైనారిటీలో పడిపోయింది.కొన్నిగంటల క్రితమే కరోనా వ్యాక్సినేషన్‌పై ఎల్‌జీ నివాసంలో రివ్యూ చేశారు కిరణ్‌బేడీ.

కొన్నిగంటల క్రితమే కరోనా వ్యాక్సినేషన్‌పై ఎల్‌జీ నివాసంలో రివ్యూ చేశారు కిరణ్‌బేడీ. అయితే ఎందుకు కిరణబేడీని ఆకస్మాత్తుగా తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసిన తరువాత పుదుచ్చేరి అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎమ్మెల్యే రాజీనామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వి.నారాయణసామి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేస్తామని పుదుచ్చేరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కందసామి మంగళవారం అన్నారు. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్ బేడీ నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేధిస్తున్నారని.. కాంగ్రెస్ పాలనను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఎం నారాయణసామి నేతృత్వంలోని మంత్రివర్గాన్ని రద్దు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కందస్వామి ఒక వీడియోలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com