వలస కార్మికుల కోసం మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మదీన ఎమిర్

- February 17, 2021 , by Maagulf
వలస కార్మికుల కోసం మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మదీన ఎమిర్

రియాద్:మదీనా ప్రాంతంలోని వలస కార్మికులకు ఇక నివాస కష్టాలు తొలిగిపోనున్నాయి. దాదాపు 3000 మంది సౌకర్యంగా ఉండేలా చేపట్టిన మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తి అయ్యాయి. మదీన ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ వలస కార్మికుల హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. కరోనా మహమ్మారితో నివాస నిబంధనలు కఠినతరంగా చేసిన సౌదీ ప్రభుత్వం..ఒక గదిలో ఉండే వలస కార్మికుల సంఖ్యకు పరిమితి విధించింది. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు తనిఖీలు చేపట్టిన సమయంలో మదీన ప్రాంతంలో దాదాపు 17,000 మంది ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది.వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి..వారి సరైన నివాస వసతుల కల్పనకు పూనుకుంది.ఇందులో భాగంగానే 39,800 చదరపు మీటర్లలో 3,000 మంది కార్మికులు సౌకర్యవంతంగా ఉండేలా మోడల్ హౌసింగ్ ప్రాజెక్టును పూర్తి చేసింది.ఇది తొలి దశ ప్రాజెక్ట్ మాత్రమే.త్వరలోనే 2,50,000 చదరపు మీటర్లలో 15 వేల మందికి నివాస వసతి కల్పించనున్నట్లు ఎమిర్ వెల్లడించారు. వలస కార్మికులను దేశ అభివృద్ధిలో భాగమని..అందుకే వారిని తమ అతిథులుగానే భావిస్తున్నామని ఎమిర్ అభిప్రాయపడ్డారు.వలస కార్మికుల పట్ల తాము ఎప్పుడూ మానవతాదృక్పథంతోనే వ్యవహరిస్తామని, వారి ఆరోగ్యం, భద్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com