ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- February 17, 2021
యూఏఈ:ఫేక్ యూనివర్సిటీ డిగ్రీల సర్టిఫికెట్లను అరికట్టేందుకు యూఏఈ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాల పొందేందుకు ఎవరైనా నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లను సమర్పించినా..ఇతర వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను రూపొందించినా జరిమానా, జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఈ మేరకు ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. ఇక నుంచి ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా ప్రయోజనం పొందెందుకు ప్రయత్నిస్తే 30,000 నుంచి ఒక మిలియన్ వరకు దిర్హామ్ ల జరిమానాతో పాటు మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుంది. ఫెడరల్ నేషనల్ కౌన్సినల్ పాస్ చేసిన ముసాయిదా చట్టంలో బోగస్ ఎడ్యూకేషన్ సర్టిఫికెట్లను అడ్డుకునేందుకు 11 ఆర్టికల్స్ ను ప్రతిపాదించారు.విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆమోదం పొందిన ఈ డ్రాఫ్ట్ లాను యూఏఈ ప్రెసిడెంట్ కు సమర్పించారు.ప్రెసిడెంట్ ఆమోదం తెలుపగానే బిల్లు చట్టరూపం దాల్చనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు