నితిన్30 రిలీజ్ డేట్ ఫిక్స్
- February 19, 2021టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలోనే వరుసగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ చేసిన రెండు సినిమాలు రంగ్ దే, చెక్ చిత్రాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా నితిన్ కెరీర్లో చేస్తున్న 30వ సినిమా. ఈ చిత్రాన్ని హిందీ అంధాధున్ సినిమా రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్11 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. నితిన్ చేసిన చెక్ సినిమా ఫిబ్రవరి26, రంగ్ దే మార్చి 26న థియేటర్లలోకి రానున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో నితిన్ వరుసగా మూడు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్