పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల..
- February 20, 2021
హైదరాబాద్:పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళికలతో వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు షర్మిల. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో లోటస్ పాండ్ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వారికి ఒక ప్రశ్నావళిని సంధించారు షర్మిల. రెండు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాశారు. షర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి ఏ సమాధానం చెప్పాలనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, దూసుకొస్తున్న బీజేపీని నిలువరించడానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఉన్న అవకాశాలను చెప్పాలంటూ ఈ ప్రశ్నాపత్నం రూపొందించారు. సడెన్గా తీసుకున్న రాజకీయ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఇందులోని ప్రధాన ప్రశ్న. తెలంగాణకు వైఎస్ఆర్ ఏమేం చేశారు, మీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులేంటి అంటూ ప్రశ్నలు సంధించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!