పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల..

- February 20, 2021 , by Maagulf
పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల..

హైదరాబాద్:పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళికలతో వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు షర్మిల. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో లోటస్‌ పాండ్‌ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వారికి ఒక ప్రశ్నావళిని సంధించారు షర్మిల. రెండు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాశారు. షర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి ఏ సమాధానం చెప్పాలనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, దూసుకొస్తున్న బీజేపీని నిలువరించడానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఉన్న అవకాశాలను చెప్పాలంటూ ఈ ప్రశ్నాపత్నం రూపొందించారు. సడెన్‌గా తీసుకున్న రాజకీయ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఇందులోని ప్రధాన ప్రశ్న. తెలంగాణకు వైఎస్‌ఆర్‌ ఏమేం చేశారు, మీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి పనులేంటి అంటూ ప్రశ్నలు సంధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com