టిబి వ్యాధిగ్రస్తులు యూఏఈ వీసా పొందచ్చు
- February 26, 2016
యూఏఈ రెసిడెంట్స్, టిబి వ్యాధితో ఒకప్పుడు బాధపడి కోలుకుంటున్నవారికి స్పాన్సర్ చేసే అవకాశాన్ని పొందుతున్నారు. సంబంధిత వర్గాల నుంచి అనుమతి తీసుకుని, వారికి రెసిడెంట్స్ స్పాన్సర్ చేయవచ్చు. కొత్త రెసిడెంట్స్‌కి టిబి చెకప్ జరుగుతుంది. అయితే టిబితో బాధపడుతున్నవారికి మాత్రం ప్రవేశంపై యధాతథంగా నిషేధం వర్తిస్తుంది. జనవరి 27 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో నిబంధనల మార్పు ఏమీ లేదు. హెచ్‌ఐవి, టిబి, సిఫిలిస్, హెపటైటిస్ బి మరియు సి, ప్రెగ్నెన్సీ పరీక్షలు మెయిడ్స్, సెలూన్ వర్కర్స్, ఫుడ్ హ్యాండిలర్స్ వంటివారికి తప్పనిసరిగా కొనసాగుతాయి. పైన చెప్పబడిన ఏ వ్యాధి కలిగి ఉన్నా యూఏఈలోకి ప్రవేశం నిషిద్ధం. యూఏఈ రెసిడెంట్స్ టిబితో బాధపడుతుంటే, వారిని మెడికల్‌గా అన్‌ఫిట్ కింద పరిగణిస్తారు. వారి వీసా రెన్యువల్‌ని తిరస్కరిస్తారు. అయితే వారికి ఏడాదిపాటు వీసా, మెడికల్ సర్టిఫికెట్‌తోపాటు ఇస్తారు. ట్రీట్‌మెంట్‌కి లోబడి అనే ప్రస్తావన వీసాలో ఉంటుంది. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు హెల్త్‌కేర్ సెంటర్స్‌లో మూడు పర్యాయాలు చికిత్స పొందవలసి ఉంటుంది. ట్రీట్‌మెంట్ షెడ్యూల్‌ని పాటించని పక్షంలో దేశం నుంచి వారిని బయటకు పంపేయడం జరుగుతుంది. v
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







