బహ్రెయిన్: సోషల్ డిస్టెన్స్ పాటించని ఏడుగురికి జరిమానా

- February 21, 2021 , by Maagulf
బహ్రెయిన్: సోషల్ డిస్టెన్స్ పాటించని ఏడుగురికి జరిమానా

మనామా:కోవిడ్ నిబంధనల అమలులో బహ్రెయిన్ ప్రభుత్వం కఠిన చర్యలను కొనసాగిస్తోంది. నిబంధనలు పాటించని సంస్థలతో పాటు..వ్యక్తులకు మినహాయింపు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిబంధనల అమలుకు సంబంధించి అధికారులు చేపట్టిన తనిఖీల్లో 437 మంది పలు నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. వాళ్లందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించామని వెల్లడించారు. ఉల్లంఘునుల్లో 374 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, 47 మంది ఒకే వాహనంలో పరిమితికి మించి ప్రయాణిస్తున్నట్లు అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిపోర్ట్ చేశారు. నిందితుల్లో ఏడుగురు భౌతిక దూరం పాటించలేదని, ఇద్దరు వ్యక్తులు ఎహ్తెరాజ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోలేదన్నారు. మరో ఏడుగురు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారని వెల్లడించారు. సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత తమ బాధ్యతని...వైరస్ వ్యాప్తికి దోహదపడేలా ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా..నిబంధనలు పాటించకపోయినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com