కర్ఫ్యూ పరిస్థితుల దిశగా సిద్ధమవండి...అధికారులకు కువైట్ ఆదేశాలు
- February 21, 2021
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల్లో కొన్నాళ్లుగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందా? మరోసారి కువైట్ కర్ఫ్యూ పరిస్థితులను ఎదుర్కొబోతోందా? కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి వెలువడుతున్న ఉత్తర్వులు, సన్నాహఆలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. తగ్గిందనుకున్న కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రత కువైట్ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతూ వస్తోంది. దీంతో సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ...దేశంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఒక వేళ మళ్లీ కర్ఫ్యూ దిశగా పరిస్థితులు దిగజారినా..అందుకు తగినట్లు సన్నద్దంగా ఉండాలని పేర్కొంది. కుదిరితే పాక్షిక కర్ఫ్యూ, లేదంటే పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!