రిమోట్ వర్కింగ్, ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ఉత్తమ దేశంగా యూఏఈ

- February 21, 2021 , by Maagulf
రిమోట్ వర్కింగ్, ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ఉత్తమ దేశంగా యూఏఈ

యూఏఈ:కరోనా సమయంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించటంలో యూఏఈ అత్యుత్తమ విధానాలు పాటించినట్లు ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయటంతో పాటు పలు ప్రమాణాలు పాటించటంలో యూఏఈ అరబ్ దేశాల్లోనే తొలి స్థానం దక్కించుకుంది. అలాగే అంతర్జాతీయంగా 31వ స్థానంలో నిలిచింది. కరోనా కాలంలో ఉద్యోగులపై ఒత్తిడి, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పాటిస్తున్న ప్రమాణాలపై యూకేకి చెందిన సర్కిల్ లూప్ అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించింది. దాదాపు 95 శాతం ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ వెసులుబాటు కల్పించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకుందని యూఏఈని ప్రశంసించింది. అంతేకాదు..ఉద్యోగుల సేఫ్టీ ఇండెక్స్ లో యూఏఈ ఇటలీ, జపాన్, హాంకాంగ్, ఐర్లాండ్, మలేషియా, రష్యా, యుఎస్ఎ, చైనాలను కూడా అధిగమించటం విశేషం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com