కువైట్:మార్చి 7 నుంచి 24 గంటల పాటు విమానాశ్రయ సేవలు

- February 25, 2021 , by Maagulf
కువైట్:మార్చి 7 నుంచి 24 గంటల పాటు విమానాశ్రయ సేవలు

కువైట్ సిటీ:దాదాపు ఏడాది తర్వాత కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు మళ్లీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7 నుంచి 24 గంటల పాటు ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభం కానున్నాయని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం స్పష్టం చేసింది. కువైట్ ఎయిర్ పోర్టులో సర్వీసులు నడిపిస్తున్న అన్ని విమానయాన సంస్థలకు ఈ మేరకు సమాచారం అందించామని..మార్చి 7 నుంచి పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభం అవుతుండటంతో అందుకు తగినట్లుగా సమయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపినట్లు వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com