మస్కట్: ఏప్రిల్ 14 నుంచి రమదాన్ పవిత్ర మాసం ప్రారంభమయ్యే అవకాశాలు
- February 25, 2021
మస్కట్: మహమ్మదీయుల పవిత్ర మాసం రమదాన్ వచ్చే ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని హిజ్రీ క్యాలెండర్ విభాగం అధిపతి ప్రకటించారు. ఈద్ అల్ ఫితర్ మే 13, గురువారం రోజున వస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 1442 AH సంవత్సరానికి రంజాన్ నెల నెలవంక గురించి చేసిన ఖగోళ గణాంకాల మేరకు ఏప్రిల్ 12, సోమవారం చంద్రుడు సంయోగ దశలో ఉంటాడని..ఉదయం 6:31 గంటలకు చంద్రుడు అస్తమిస్తాడన్నారు. అదే రోజు సాయంత్రం 6:27 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడని..ఆ తర్వాత 20 నిమిషాల వ్యవధి తర్వాత చంద్రోదయం ఉంటుందని లెక్క గట్టారు. దీని ప్రకారం, ఏప్రిల్ 13, 2021 మంగళవారం షాబాన్ నెల పూర్తవుతుందని, 2021 ఏప్రిల్ 14 బుధవారం 1442 సంవత్సరానికిగాను పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమవుతుంది అని ధృవీకరించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







