ఫస్ట్‌టైమ్ అలాంటీ పాత్రలో సమంత..
- February 25, 2021టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీకి ఇప్పటికి 11 సంవత్సరాలు.. ఈ సందర్భంగా ఆమె తాజా చిత్రం శాకుంతలం గురించి అప్ డేట్ వచ్చింది. సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా వెలుగుతోంది. ప్రస్తుతం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. అందులో భాగంగా సమంత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్లో కీలకపాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుందని అమోజాన్ ప్రకటించింది. ఇక అది అలా ఉంటే ఆమె ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందని ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సమంత రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటుందనే టాక్. సమంత తన 11 ఏళ్ల కెరీర్ లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..