బలమైన గాలులు, వర్షాలు కురిసే అవకాశం

బలమైన గాలులు, వర్షాలు కురిసే అవకాశం


బహ్రెయిన్: మిటియరలాజికల్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం వుందనీ, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. 7 నుంచి 12 నాట్స్ వేగంతో వీచే గాలులు 12 నుంచి 17 నాట్స్ వేగాన్ని అందుకునే అవకాశం వుంది. పగటి వేళ ఈ గాలుల వేగం 20 నుంచి 25 నాట్స్ వరకూ వుండొచ్చు. 35 నాట్స్ వేగం కూడా అందుకునే అవకాశం వుందని మిటియరలాజికల్ డైరెక్టరేట్ పేర్కొంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 22 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 16 డిగ్రీల సెల్సియస్ వుండొచ్చు. హ్యమిడిటీ అత్యధికంగా 90 శాతం, అత్యల్పంగా 40 శాతం నమోదవ్వొచ్చు.

Back to Top