భారత్ - పాక్ సంచలన నిర్ణయం..
- February 25, 2021
న్యూఢిల్లీ: భారత్, పాక్‌కు చెందిన ఇరు దేశాల బలగాలు గురువారం ఓ సంచలన నిర్ణయానికి వచ్చాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఈ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తరుచూ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ‘‘ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.’’ అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003 లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా... తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







