ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్‌.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌

ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్‌.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌

హైదరాబాద్ : ఈ-గవర్నెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతుంది. దేశంలోనే ముందంజలో ఉందని మరోమారు నిరూపితమైంది. ఈ-గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నందుకుగాను 2020 ఏడాదికిగాను రాష్ర్టానికి స్కోచ్‌ గ్రూప్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. అదేవిధంగా ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను స్కోచ్‌ బెస్ట్‌ ఫెర్మార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌ అవార్డు వరించింది. కొవిడ్‌-19 సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగించుకుంది. 2016లో సైతం మంత్రి కేటీఆర్‌ స్కోచ్‌ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్‌ అవార్డు దక్కించుకున్న ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ రికార్డు నెలకొల్పారు.

Back to Top