కువైట్:క్వారంటైన్ ఉల్లంఘనులపై ఆన్ లైన్ నిఘా..
- February 26, 2021
కువైట్ సిటీ:తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులపై ఆన్ లైన్ ద్వారా నిఘా వేయనుంది కువైట్. తమ దగ్గర నిక్షిప్తమై ఉన్న సమాచారంతో ఎవరెవరూ క్వారంటైన్ లో ఉంటున్నారు..ఎవరు రూల్స్ కి విరుద్ధంగా జనంలో తిరుగుతున్నారనేది ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటా ద్వారా చెక్ చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా క్వారంటైన్ లో ఉన్న వారి హెల్త్ స్టేటస్ ను పర్యవేక్షించిటంతో పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే గుర్తించగలమని స్పష్టం చేసింది. ఎవరైనా రూల్స్ ను బ్రేక్ చేస్తే వెంటనే తమ పాట్రోలింగ్ బృందాలు వెంటనే ఉల్లంఘనులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారిని అరెస్ట్ చేస్తాయని హెచ్చరించింది. తోటి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టడంతో పాటు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన నేరానికి వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!