యూఏఈ:ఇక స్మార్ట్ కార్ల ద్వారా డ్రైవింగ్ టెస్టులు
- February 26, 2021
యూఏఈ:ఎప్పటికప్పడు అధునాతన సాంకేతికను, కృత్రిమ మేథస్సు ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్న యూఏఈ రోడ్ సెఫ్టీ విషయంలో మరింత నిఖచ్చిగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ స్మార్ట్ కార్ల ద్వారా టెస్ట్ డ్రైవ్ లను నిర్వహించనుంది. ముందస్తుగా అబుధాబి ఎమిరాతి పరిధిలో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇముడ్చుకున్న స్మార్ట్ కారు ద్వారానే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అబుధాబి పోలీసులు వెల్లడించారు. టెస్టుకు హజరయ్యే వారు స్మార్ట్ కారులో డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేయగానే వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని స్మార్ట్ కార్ అంచనా వేసుకుంటుంది. ఆ వెంటనే వారు లైసెన్స్ పొందెందుకు ఆర్హులో కాదో తెలుపుతూ ఆటోమెటిగ్ గా రిపోర్ట్ ను రూపొందిస్తుంది. ఆ రిపోర్ట్ ను దరఖాస్తుదారుడికి నేరుగా పంపిస్తుంది. అంటే స్మార్ట్ కార్ రిపోర్ట్ ఒకే అయితేనే దరఖాస్తుదారులకు లైసెన్స్ మంజూరు చేస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







