యూఏఈ:ఇక స్మార్ట్ కార్ల ద్వారా డ్రైవింగ్ టెస్టులు
- February 26, 2021యూఏఈ:ఎప్పటికప్పడు అధునాతన సాంకేతికను, కృత్రిమ మేథస్సు ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్న యూఏఈ రోడ్ సెఫ్టీ విషయంలో మరింత నిఖచ్చిగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ స్మార్ట్ కార్ల ద్వారా టెస్ట్ డ్రైవ్ లను నిర్వహించనుంది. ముందస్తుగా అబుధాబి ఎమిరాతి పరిధిలో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇముడ్చుకున్న స్మార్ట్ కారు ద్వారానే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అబుధాబి పోలీసులు వెల్లడించారు. టెస్టుకు హజరయ్యే వారు స్మార్ట్ కారులో డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేయగానే వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని స్మార్ట్ కార్ అంచనా వేసుకుంటుంది. ఆ వెంటనే వారు లైసెన్స్ పొందెందుకు ఆర్హులో కాదో తెలుపుతూ ఆటోమెటిగ్ గా రిపోర్ట్ ను రూపొందిస్తుంది. ఆ రిపోర్ట్ ను దరఖాస్తుదారుడికి నేరుగా పంపిస్తుంది. అంటే స్మార్ట్ కార్ రిపోర్ట్ ఒకే అయితేనే దరఖాస్తుదారులకు లైసెన్స్ మంజూరు చేస్తారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు